Balaveeranjaneya Swamy: మెడికల్ కాలేజీలపై మంత్రి డోలా కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:55 PM
మెడికల్ కాలేజీలను ఎవరికీ దారాదత్తం చెయ్యడం లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. వైసీపీ చేసిన పాప ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం, డిసెంబర్ 15: వైసీపీ నాయకులు కోటి సంతకాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం నాడు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.8,500 కోట్లు ఇస్తే.. రూ.1500 కోట్లు కూడా ఖర్చు చెయ్యలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో 18 శాతం నిర్మాణం కూడా పూర్తి చెయ్యలేదన్నారు. మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ వైద్య కళాశాల అనే పేరు తాము పెడుతున్నామని స్పష్టం చేశారు.
మెడికల్ కాలేజీలను ఎవరికీ దారాదత్తం చెయ్యడం లేదని వెల్లడించారు. వైసీపీ 64 మందికి సీట్లు ఇస్తే... తాము 75 మందికి సీట్లు ఇస్తున్నామని చెప్పారు. ఎక్కువ మంది విద్యార్థులకు ఉచిత సీట్లు ఇస్తున్నామన్నారు. వైసీపీ చేసిన పాప ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.
పులివెందులలో కూడా జగన్ మెడికల్ కాలేజీ కట్టలేకపోయారని వ్యాఖ్యలు చేశారు. 11 సీట్లకే పరిమితమైన జగన్‌ను వైసీపీ కార్యకర్తలు ఛీత్కరిస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నాలుగవ రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ.. ఆ సమాచారంపైనే సిట్ ఫోకస్
పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telugu News