Phone Tapping Case: నాలుగవ రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ.. ఆ సమాచారంపైనే సిట్ ఫోకస్
ABN , Publish Date - Dec 15 , 2025 | 10:13 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ నాలుగవ రోజుకు చేరుకుంది. మూడు రోజుల పాటు జరిగిన విచారణలో అనేక విషయాలపై సిట్ విచారించింది. అయితే పలు ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానం ఇవ్వనట్లు సమాచారం.
హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Former SIB Chiefh Prabhakar Rao) కస్టడీ విచారణ కొనసాగుతోంది. నాలుగవ రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే మూడు రోజుల పాటు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ను పలు అంశాలపై సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ముందు ఉంచి మరీ ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే అనేక ప్రశ్నలకు ఆయన నోరు మెదపనట్లు తెలుస్తోంది.
ప్రభాకర్‌రావు వినియోగించిన ఐక్లౌడ్, జీ మెయిల్ ఖాతాల కేంద్రంగా విచారణ కొనసాగుతోంది. ఐ క్లౌడ్, జీ మెయిల్ అకౌంట్ ఖాతాల్లోని సమాచారంపై సిట్ ప్రధానంగా దృష్టిసారించింది. ప్రభాకర్ రావు ఎరేజ్ చేసిన డేటా కోసం యాపిల్, జీ మెయిల్ సంస్థలకు సిట్ ఇప్పటికే లేఖలు రాసింది. వారిచ్చే సమాచారంతో కీలక విషయాలు వెలుగు చూస్తాయని సిట్ భావిస్తోంది.
అమెరికాలో ఉన్న డివైస్‌లో ఐ క్లౌడ్ ఖాతాతో ప్రభాకర్ రావు లాగిన్ అయినట్లు సిట్ గుర్తించింది. అయితే ఆ డివైస్‌ను అమెరికాలోనే వదిలేసి వచ్చారు ప్రభాకర్ రావు. ఈ క్రమంలో అసలు ఆ ఖాతాలో ఎందుకు లాగిన్ అయ్యారు అన్న కోణంలో సిట్ విచారణ సాగుతోంది.
ఇవి కూడా చదవండి..
వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు.. అమాంతం గాల్లోకి ఎగిరి
హైదరాబాద్‌లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు
Read Latest Telangana News And Telugu News