Share News

TG Bharath: పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం: మంత్రి టీజీ భరత్

ABN , Publish Date - Dec 15 , 2025 | 10:49 AM

దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి పొట్టి శ్రీరాములే కారణమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని.. ప్రజలందరి వ్యక్తి అని అన్నారు.

TG Bharath: పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం: మంత్రి టీజీ భరత్
TG Bharath

కర్నూలు, డిసెంబర్ 15: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చిన్న అమ్మవారి శాల వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి టీజీ భరత్ (Minister TG Bharath) పాలాభిషేకం చేశారు. ఆపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి పొట్టి శ్రీరాములే కారణమని తెలిపారు. పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని.. ప్రజలందరి వ్యక్తి అని అన్నారు.


పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తామని పొట్టి శ్రీరాములు నిరూపించారని చెప్పారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం నిర్మాణానికి కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాలు కేటాయించిందన్నారు. స్మృతివనం శంకుస్థాపన రోజు మొదటి దాతగా 1 కోటి రూపాయలు తమ టీజీవీ సంస్థల నుండి విరాళం ఇచ్చినట్లు వెల్లడించారు. కర్నూలులో పొట్టి శ్రీరాములు విగ్రహం ఉన్న కూడలిలో అవసరమైన అభివృద్ధి పనులు చేస్తామని స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చిన్న అమ్మవారి శాల వద్ద ఉన్న ఆయన విగ్రహం వద్దనే నిర్వహిస్తామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

హైదరాబాద్‌లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు

నాలుగవ రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ.. ఆ సమాచారంపైనే సిట్ ఫోకస్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 15 , 2025 | 11:03 AM