Share News

GVMC: జీవీఎంసీకి ప్రతిష్టాత్మక అవార్డులు

ABN , Publish Date - Dec 15 , 2025 | 09:41 AM

47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో జీవీఎంసీకి మూడు ప్రతిష్టాత్మక పీఆర్‌ఎస్‌ఐ - 2025 జాతీయ అవార్డులు వచ్చాయి. జీవీఎంసీకి జాతీయ అవార్డులు రావడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

GVMC: జీవీఎంసీకి ప్రతిష్టాత్మక అవార్డులు
GVMC

విశాఖపట్నం,డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): 47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో జీవీఎంసీకి మూడు ప్రతిష్టాత్మక పీఆర్‌ఎస్‌ఐ - 2025 జాతీయ అవార్డులు (GVMC PRSI National Awards) వచ్చాయి. డెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. జీవీఎంసీ తరపున అదనపు కమిషనర్ డీవీ రమణ మూర్తి, పౌర సంబంధాల అధికారి ఎన్. నాగేశ్వరరావు ఈ అవార్డులను స్వీకరించారు. జీవీఎంసీకి జాతీయ అవార్డులు రావడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు.


అవార్డుల వివరాలివే..

1. బెస్ట్ సీఎస్ఆర్ ప్రాజెక్ట్ ఫర్ చైల్డ్ కేర్ - ప్రథమ స్థానం

2. బెస్ట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఏ కార్పొరేట్ క్యాంపెయిన్ - ప్రథమస్థానం

3. ఉమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్- ద్వితీయ స్థానం


ఈ వార్తలు కూడా చదవండి..

పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల

విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 15 , 2025 | 09:51 AM