Yanamala Ramakrishnudu: పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల
ABN , Publish Date - Dec 14 , 2025 | 10:36 AM
ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ భారం సామాన్య ప్రజలపై పడుతోందని పేర్కొన్నారు.
అమరావతి, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): ధనికులు –పేదల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించేందుకు ట్యాక్స్ ది రిచ్ (Tax the Rich) అంశాన్ని ప్రభుత్వాలు ప్రాధాన్యతగా తీసుకోవాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) సూచించారు. యాభై ఏళ్ల క్రితం ఉన్న పన్ను విధానం, నేటి పరిస్థితుల్లో కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. కార్పొరేట్ పన్నుల ఆదాయం కంటే వ్యక్తిగత ఆదాయ పన్నులే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఇవాళ(ఆదివారం) అమరావతి వేదికగా మీడియాతో మాట్లాడారు యనమల రామకృష్ణుడు.
ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తోందని తెలిపారు. ఈ భారం సామాన్య ప్రజలపై పడుతోందని చెప్పుకొచ్చారు. విజన్–2047 లక్ష్యాలను పరిమిత ఆదాయ వనరులతో చేరుకోవడం కష్టసాధ్యమని తెలిపారు. ఆదాయ వనరులు సరిపోని పరిస్థితుల్లో పేదలపై భారం మోపకుండా పన్ను సంస్కరణలు తప్పనిసరి చేయాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెంచేందుకు ట్యాక్స్ ది రిచ్, సంపద పన్ను, కేంద్రం నుంచి గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ పెంచాలని పేర్కొన్నారు. పన్నుల విభజనను 41శాతం నుంచి 50శాతానికి పెంచడంతో ప్రత్యక్ష పన్నుల పెంపు, వారసత్వ పన్ను, కేంద్ర ప్రాయోజిత పథకాల (CSS)లో రాష్ట్రాల వాటాను 60శాతం నుంచి 40శాతానికి తగ్గించవచ్చని వివరించారు. ఈ క్రమంలో ఎస్టేట్ డ్యూటీ అమలు వంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని యనమల రామకృష్ణుడు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత
శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్
Read Latest AP News And Telugu News