Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్
ABN , Publish Date - Dec 13 , 2025 | 08:27 AM
తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్‌స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
తిరుమల, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామిని (Lord Venkateswara Swamy) సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) - లతా రజనీకాంత్ దంపతులు ఇవాళ (శనివారం)తెల్లవారుజామున దర్శించుకున్నారు. కూతుర్లు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా వారి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారికీ తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు రజనీకాంత్ దంపతులు.
రజనీకాంత్ 72 కిలోల చక్కెర, బెల్లం, కలకండ, బియ్యం, చిల్లర నాణేలతో రజనీకాంత్.. ఆయన సతీమణి లతా రజనీకాంత్ 82 కిలోలతో స్వామివారికీ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అయితే, మంత్రి సవిత కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో దర్శనం అనంతరం రజనీకాంత్‌తో మంత్రి సవితతో పాటు టీటీడీ సభ్యులు కూడా ఫొటోలు దిగారు. సూపర్‌స్టార్ అభిమానులు కూడా ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. అభిమానులతో సరదాగా మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు రజనీకాంత్.
కాగా, సూపర్‌స్టార్ 71వ జన్మదిన వేడుకలు నిన్న(శుక్రవారం) ఘనంగా జరిగాయి. రజనీకాంత్ అభిమానులు బర్త్‌డేను గ్రాండ్‌గా చేసుకున్నారు. ఆయన ఫ్యాన్స్ వాడవాడలా కేకులు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే, జైలర్-2 సినిమా పనుల్లో రజనీకాంత్ ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత
అల్లూరి జిల్లా బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News