Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత

ABN , Publish Date - Dec 13 , 2025 | 07:12 AM

వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత
CM Chandrababu

అమరావతి, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో (Fibernet Corporation) అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై (CM Nara Chandrababu Naidu) నమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 2014-19 నడుమ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో నిబంధనలను ఉల్లంఘించి వివిధ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని, దానివల్ల కార్పొరేషన్‌కు రూ.114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. నాటి ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేమూరి హరికృష్ణ, ఎండీ కె.సాంబశివరావు, టెర్రాసాఫ్ట్‌ డైరెక్టర్‌ తుమ్మల గోపాలకృష్ణ, చంద్రబాబు (ఏ-25), ముంబై, ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, వాటి ఉన్నతాధికారులను నిందితుల జాబితాలో చేర్చారు.


మొత్త్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. కేసులో దర్యాప్తు పూర్తయినట్లు కొద్దిరోజుల క్రితం సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు నివేదిక ఇచ్చారు. అయితే ఖజానాకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని.. కేసును ఉపసంహరించుకుంటున్నట్లు అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి గత నెల 24న కోర్టులో అఫిడవిట్‌ దాఖలుచేశారు. ఇందుకు అభ్యంతరం లేదని ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా అఫిడవిట్‌ ఇచ్చారు.


కోర్టు తీర్పు వెలువడుతుందనే సమయానికి ఆ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత గౌతంరెడ్డి రంగప్రవేశం చేశారు. తీర్పు ఇచ్చే ముందు తన వాదనలను వినాలని ప్రొటెస్ట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి విచారణార్హత లేదంటూ న్యాయాధికారి పి.భాస్కరరావు పిటిషన్‌ను గురువారం కొట్టివేశారు. ఆ క్రమంలోనే ఫైబర్‌ నెట్‌ కేసును కూడా కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. రాజకీయ కుట్రతోనే.. ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబుపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. అభియోగాలను నిరూపించలేకపోయింది. అక్రమాలు జరిగలేదని స్పష్టం చేసింది. ఆయనపై అవినీతి ముద్ర వేసి గత ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న రాజకీయ కుట్రతోనే ఈ కేసు పెట్టారని తేలిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

అల్లూరి జిల్లా బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 13 , 2025 | 07:24 AM