Home » Yanamala RamaKrishnudu
ఉద్యోగుల సంఘం డిమాండ్లను వైసీపీ పూర్తిగా విస్మరించిందని యనమల వ్యాఖ్యలు చేశారు. వారి సమస్యల గురించి వారితో ఎప్పుడూ చర్చలు జరపలేదని మండిపడ్డారు.
జీఎస్టీ తగ్గింపు రేట్లు పేదల వినియోగ వ్యయాన్ని తగ్గించడానికి సహాయపడతాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఉద్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఐదు కోట్ల మందికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పథకం ఆరోగ్య ఖర్చును తగ్గించడానికి, పేదలకు DBT (సంక్షేమ పథకాలు) శ్రమ డబ్బుకు అదనపు ఆదాయంగా ఉంటాయని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
ప్రజలను మోసం చేసి మద్యం కుంభకోణంలో జగన్ దోచుకున్న రూ.3500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి ప్రభుత్వానికి సూచించారు. రెవెన్యూ రికవరీ చట్టం లేదా కొత్త చట్టం తీసుకొచ్చి జగన్ కాజేసిన సొమ్మును ప్రభుత్వం వసూలు చేయాలని అన్నారు.
Yanamala On Jagan: జగన్ కూడా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా అనేక కుట్రలకు పాల్పడ్డారని యనమల మండిపడ్డారు. జగన్ ప్రస్తుతం ఆయన తల్లి, చెల్లికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Yanamala: రూల్ ఆఫ్ లా సాక్షి యాజమాన్యానికి, సాక్షిలో పని చేసే సిబ్బందికి వర్తించదా.. అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వైఎస్ పాలనలో, జగన్ హయాంలో మీడియా వాచ్ పేరుతో నాటి ప్రభుత్వాలు నల్ల చట్టాలు తీసుకురాలేదా అని నిలదీశారు.
Yanamala Ramakrishna: ట్రంప్ సుంకాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తోందని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రభుత్వంపై అప్పుల భారం, వ్యక్తిగత రుణాలు ఈనాటి ఆర్థిక పరిస్థితిని మరింత కుంగదీస్తున్నాయని చెప్పారు.
Political Career Of Yanamala: 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వివిధ పదవుల్లో కొనసాగడం తన అదృష్టమన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మాఫియాపై తెలుగుదేశం సీనియర్ నేత విమర్శలు గుప్పించారు. జగన్ కు ఈ అక్రమాల్లో వాటా ఉంది కాబట్టే ఆయన ఈ మాఫియాకు సపోర్ట్ గా తన గళం విప్పుతున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చడంపై దృష్టిపెట్టిందన్నారు.
కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణ అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఈనెల ఆరో తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చని అన్నారు.
పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.