Yanamala Ramakrishna Comments on GST Reforms: జీఎస్టీ తగ్గింపుతో పేదలకు మేలు
ABN , Publish Date - Sep 05 , 2025 | 09:14 AM
జీఎస్టీ తగ్గింపు రేట్లు పేదల వినియోగ వ్యయాన్ని తగ్గించడానికి సహాయపడతాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఉద్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఐదు కోట్ల మందికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పథకం ఆరోగ్య ఖర్చును తగ్గించడానికి, పేదలకు DBT (సంక్షేమ పథకాలు) శ్రమ డబ్బుకు అదనపు ఆదాయంగా ఉంటాయని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
అమరావతి, సెప్టెంబరు5 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ (GST) తగ్గింపు రేట్లు పేదల వినియోగ వ్యయాన్ని తగ్గించడానికి సహాయపడతాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) ఉద్ఘాటించారు. ఈ మేరకు యనమల రామకృష్ణుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఐదు కోట్ల మందికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పథకం ఆరోగ్య ఖర్చును తగ్గించడానికి, పేదలకు DBT (సంక్షేమ పథకాలు) వారి శ్రమ డబ్బుకు అదనపు ఆదాయంగా ఉంటాయని పేర్కొన్నారు యనమల రామకృష్ణుడు.
జీఎస్టీ సవరణలతో సామాన్యుల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ క్రింది విధంగా వారికి దోహదం చేస్తాయని వివరించారు. సామాన్యుల పొదుపు పెరుగుతుందని, (4Ps) ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం, పేదలకు ప్రయోజనం, కొంతవరకు అసమానతలు తగ్గవచ్చని సూచించారు. అలాగే కుటమి ప్రభుత్వం తన మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడానికి ఇది మంచి చర్య అని అభివర్ణించారు. జీఎస్టీ సవరణలతో ఎల్లప్పుడూ పేదల జీవన ప్రమాణాలకు సహాయపడుతోందని వెల్లడించారు. భారత రాజ్యాంగంలో పరిగణించిన సంక్షేమ రాజ్యం కోసం కుటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు
Read Latest Andhra Pradesh News and National News