Share News

CM Chandrababu Teachers Day Message: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 05 , 2025 | 07:38 AM

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమవుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu Teachers Day Message: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు
CM Chandrababu Teachers Day Message

అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవం (Teachers Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (X) వేదికగా పోస్టు పెట్టారు సీఎం చంద్రబాబు.


రాజనీతిజ్ఞుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్...

‘భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న టీచర్లు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, ఉపాధ్యాయుడు, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan) జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ జరుపుకునే పండుగ రోజు ఇది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమవుతున్నారు. పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికీ అభినందనలు తెలుపుతున్నా. అదే అంకితభావంతో పని చేస్తూ ముందుతరాలకు మీరంతా మార్గదర్శులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ముస్లిం సోదరుల జీవితాల్లో మిలాద్ ఉన్ నబీ కొత్త వెలుగులు నింపాలి: సీఎం చంద్రబాబు

మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటున్న ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘అజ్ఞానాన్ని పారద్రోలి అశేష ప్రజానీకంలో విశ్వాసం నింపిన మహమ్మద్ ప్రవక్త జన్మదినానికి గుర్తుగా నిర్వహించుకునే మిలాద్ ఉన్ నబీ ముస్లిం సోదరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీతి, నిజాయితీ, ప్రేమ, త్యాగం లాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ జీవితం కొనసాగించిన మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన సూత్రాలను పాటించేందుకు ప్రేరణ కల్పించేది మిలాద్ ఉన్ నబీ. సాటివారిని గౌరవిస్తూ, వారి ఆకలి తీర్చే పవిత్ర ఆశయాలు కొనసాగాలి. అందుకు ముస్లిం సోదరులు ముందు వరుసలో ఉండాలి’ అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో తాత్కాలిక ఊరట

జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి.. పవన్ ప్రశంసలు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 05 , 2025 | 08:49 AM