Home » Sarvepalli Radhakrishnan
విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనది. ఉపాధ్యాయులు పిల్లలకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా, విద్యార్థుల జీవితాలను అందంగా తీర్చిదిద్దే వాస్తుశిల్పులు కూడా..
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమవుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణన జయంతి సందర్భంగా గురువారం స్థానిక బుగ్గకాలువలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో గురుపూజోత్సవం నిర్వహించారు.
తల్లిదండ్రుల తర్వాత గురువు లకే అగ్రపీఠమని, భావితరాలను ఉత్తమ విద్యార్థులుగా తీర్థిదిద్దేది గురువులేనని వక్తలు వ్యాఖ్యానించారు. ఎర్రగుం ట్ల మానవత యూనిట్ ఉపాధ్యాయులను సన్మానించింది. డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతి పురస్కరించుకుని విశ్రాంత డిప్యూటీ డీఈఓ బి.మునిరెడ్డి, ఉపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, భారతి, సాంబశివుడును సత్కరించారు.