Pawan Kalyan Praises Modi Govt: జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి.. పవన్ ప్రశంసలు
ABN , Publish Date - Sep 04 , 2025 | 10:04 AM
జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని కొనియాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ కౌన్సిల్‌కు(GST Council) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (X) వేదికగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం (Central Govt) జీఎస్టీ సవరణలపై ఇచ్చిన హామీని నెరవేర్చిందని ఉద్ఘాటించారు. ఇప్పుడు జీఎస్టీ భారాన్ని తగ్గించడం ద్వారా తదుపరి తరం సంస్కరణలను ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు పవన్ కల్యాణ్.
పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల ఆరోగ్య సంరక్షణకు ఇది గణనీయమైన ఉపశమనమని చెప్పుకొచ్చారు. విద్య, బీమాపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం వల్ల ప్రజలకు భారం లేకుండా ఉంటుందని వెల్లడించారు. పేదల భవిష్యత్తును మరింత వృద్ధి చేయడాన్ని తాను ప్రత్యేకంగా స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు (GST Reforms) కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని కొనియాడారు. ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచిన తర్వాత, ఈ జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి బహుమతిగా నిలుస్తాయని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News