AP Cabinet Meeting ON Several Key Issues: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Sep 04 , 2025 | 09:08 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో గురువారం కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో సుమారు 30 అంశాల ఎజెండాగా మంత్రి మండలి చర్చించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించే పలు బిల్లులు, చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన ఏపీ సచివాలయంలో ఇవాళ(గురువారం) కేబినెట్ (AP Cabinet Meeting) సమావేశం జరుగనుంది. ఈ భేటీలో సుమారు 30 అంశాల ఎజెండాగా కేబినెట్ చర్చించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించే పలు బిల్లులు, చట్ట సవరణలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఆతిథ్య హోటళ్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్.
సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో గతేడాది వరద ముంపు మరమ్మతులకు గానూ దాదాపు రూ.57.14 కోట్లు మంజూరుకు ఆమోదం తెలపనుంది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలను ఆమోదించనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనుంది. కుప్పంలో దాదాపు రూ.586 కోట్ల పెట్టుబడితో హిందాల్ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి మండలి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 613 మందికి ఉద్యోగ అవకాశాలను ఏపీ ప్రభుత్వం కల్పించనుంది.
వాహన పన్ను చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. గ్రామీణ తాగునీటి సరఫరా నిర్వహణ, పర్యవేక్షణ పాలసీపై చర్చించనుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టంలో పలు సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏబీ పీఎం జేఏవై- డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ స్కీమ్ హైబ్రెడ్ మోడ్‌లో యూనివర్షియల్ హెల్త్ పాలసీ తయారీ అమలుకు మంత్రిమండలిలో ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సిపట్నం, బాపట్ల , పార్వతీపురంలో నూతనంగా పది మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు పీపీపీ మోడ్‌లో కేబినెట్ ఆమోదించనుంది. వీటిలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో ఫేజ్- 1లో పీపీపీ మోడ్‌లో చేపట్టాలని నిర్ణయం తీసుకోనుంది. మిగిలిన ఆరు మెడికల్ కళాశాలలకు ఫీజిబిలిటీ రిపోర్ట్, డ్రాఫ్ట్ ఆర్‌పీఎఫ్, కనెక్షన్ అగ్రిమెంట్ ఆమోదం తర్వాత టెండర్ కమిటీలో స్వల్ప మార్పులు చేసి ప్రీబిడ్‌కు ఓకే చెప్పనుంది. జనవరి 1, 2025 తర్వాత విద్య, హెల్త్ కేర్ సంస్థల ఏర్పాటుకు అమరావతిలో ఇచ్చిన భూమికి స్టాంప్ డ్యూటీ రీయంబర్స్ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది.
ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965, ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2014, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్ 2016లను సవరణ చేయడంతోపాటు డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ జారీ ద్వారా యూఎల్బీ, యూడీఏ, ఏపీసీఆర్డీఏ రాజధాని ప్రాంతం మినహాయించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన భవనాలకు ఫీనలైజేషన్ చేస్తూ రెగ్యూలరైజ్‌కు అవకాశం కల్పించనుంది. ఆగస్టు 28వ తేదీన నిర్వహించిన ఎస్ఐపీబీ సమావేశం నిర్ణయాల్లో భాగంగా మదర్ డెయిరీ ప్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ఎస్ఐపీబీ సమావేశం నిర్ణయాల్లో భాగంగా స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యేలా చూసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎస్ఐపీబీ సమావేశం నిర్ణయాల్లో భాగంగా బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్, అధాని విల్మర్ లిమిటెడ్, ధైరోమర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, రామ్ సై బయో ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్, పట్టాడి ఆగ్రోఫుడ్స్‌లకు ఎర్లీ బర్డ్ ప్రోత్సాహం అందజేయడంపై చర్చించనుంది. ఎస్ఐపీబీ సమావేశం నిర్ణయాల్లో భాగంగా అపోలో టైర్స్ లిమిటెడ్ సంస్థ గ్రౌండింగ్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎస్ఐపీబీ నిర్ణయాల్లో భాగంగా వరాహ ఆక్వా ఫామ్స్ , అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రపెన్యూర్స్ ఆఫ్ ఇండియా, జె కుమార్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రతిపాదనల ద్వారా పీపీపీ పార్క్ పాలసీని అనుసరించి ప్రైవేటు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఎస్ఐపీబీ నిర్ణయాల్లో భాగంగా పీపీపీ పార్క్ పాలసీని అనుసరించి ప్రైవేట్ మెగా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ఇఫ్కో కిషాన్ సెజ్ లిమిటెడ్‌కు మంత్రిమండలి నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
బిజీ బీజీగా సీఎం చంద్రబాబు షెడ్యూల్
కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు(గురువారం) షెడ్యూల్ బిజీబిజీగా ఉంది. ఇవాళ ఉదయం 10:45 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు వెళ్తారు. 11:00 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు. మంత్రి మండలి సమావేశం అనంతరం 6:30 గంటలకు తన నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News