Anantapur: పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:12 PM
రాజకీయాలు, నిజ జీవితంలో పౌరుషానికి మారుపేరుగా బతికిన నాయకుడు నందమూరి హరికృష్ణ అని, సినిమాలు, రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా పవన్ కల్యాణ్ నిలిచారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు.
- సంచలనాలకు మారుపేరు పవన్ కల్యాణ్
- ఎమ్మెల్యే దగ్గుపాటి
- కేక్ కట్ చేసి సంబరాలు
అనంతపురం: రాజకీయాలు, నిజ జీవితంలో పౌరుషానికి మారుపేరుగా బతికిన నాయకుడు నందమూరి హరికృష్ణ(Nandamuri Harikrishna) అని, సినిమాలు, రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా పవన్ కల్యాణ్ నిలిచారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్(MLA Daggupati Venkateshwara Prasad) అన్నారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మాజీ మంత్రి, నందమూరి హరికృష్ణ జయంతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ముఖ్యమంత్రి కార్యక్రమాల కో-ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ, ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ పరిశీలకుడు కోవెలమూడి నాని, టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బీవీ వెంకటరాముడుతో కలసి హరికృష్ణకు ఘనంగా నివాళి అర్పించారు. తర్వాత కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ... నందమూరి హరికృష్ణ ఎన్టీఆర్‌కు చైతన్య రథసారధిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, సినీ నటుడిగా, నిర్మాతగా రాణించారన్నారు.

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సినిమాల్లోకి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారన్నారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పీఎల్‌ఎన్ మూర్తి, పోతుల లక్ష్మీనరసింహులు, పరమేశ్వర్, కొండన్న, నాయకులు సుధాకర్ యాదవ్, ఫిరోజ్ అహ్మద్, సంగా తేజస్విని, ఈటె స్వామిదాస్, చేపల హరి, దళవాయి వెంకట నారాయణ, నెట్టెం బాలకృష్ణ, ఓంకార్‌రెడ్డి, మల్లికార్జున, ముస్తాక్, నాగభూషణ, నాగరాజు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు
Read Latest Telangana News and National News