Share News

By Election: జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు

ABN , Publish Date - Sep 03 , 2025 | 05:16 AM

ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..

By Election: జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన ఓటర్ల ముసాయిదా జాబితాను మంగళవారం విడుదల చేశారు. ఇందులో 2,04,288 మంది పురుష ఓటర్లు, 1,88,356 మంది మహిళలు కాగా, 25 మంది ఇతరులని వివరించారు. ఓటర్లు తమ అభ్యంతరాలను ఈ నెల 17లోపు తెలియజేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో చేర్చడం లేదా తొలగించడం, సరిదిద్దడం, వేరే నియోజకవర్గానికి మార్చడం వంటి అభ్యంతరాలుంటే... 6, 7, 8 ఫారాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అభ్యంతరాలన్నింటినీ ఈ నెల 25లోపు పరిష్కరిస్తామన్నారు. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 30న బహిర్గతం చేస్తామని వివరించారు.

Updated Date - Sep 03 , 2025 | 05:16 AM