Home » Nandamuri Harikrishna
రాజకీయాలు, నిజ జీవితంలో పౌరుషానికి మారుపేరుగా బతికిన నాయకుడు నందమూరి హరికృష్ణ అని, సినిమాలు, రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా పవన్ కల్యాణ్ నిలిచారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు.
చైతన్య రథసారథి, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘననివాళి అర్పించారు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన శైలి ఆయనకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ చైతన్యరథానికి సారధిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన మహనీయుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ(Nandamuri Harikrishna) అని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి. సాయిబాబా(P. Sai Baba) కొనియాడారు.
దివంగత టీడీపీ నేత హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నివాళులర్పించారు. తన మామయ్య హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా యువనేత గుర్తుచేసుకున్నారు.