CM Chandrababu Tribute to Harikrishna: హరికృష్ణ నటుడిగా, నాయకుడిగా అసమాన ప్రతిభ చూపారు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 02 , 2025 | 10:18 AM
చైతన్య రథసారథి, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘననివాళి అర్పించారు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన శైలి ఆయనకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): చైతన్య రథసారథి, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) 69వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఘననివాళి అర్పించారు. ‘పట్టుదలకు మారుపేరుగా నిలిచిన శైలి ఆయనకు ఎందరో అభిమానులను సంపాదించిపెట్టింది. ప్రజాసేవలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నందమూరి హరికృష్ణ తరతరాలకు గుర్తుండిపోయే నాయకుడు. సినిమా నటుడుగానూ ఆయన చూపిన అసమాన ప్రతిభ చిరస్మరణీయం. ఈ సందర్భంగా హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్నా’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
హరికృష్ణ.. ఆత్మవిశ్వాసానికి చిరునామా: హోంమంత్రి అనిత
నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Minister Vangalapudi Anitha) ఘననివాళి అర్పించారు. ‘ఆత్మవిశ్వాసానికి, ఆత్మీయతకు చిరునామా అయిన కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఘన నివాళి. వారు మన మధ్య లేకపోయిన వారి జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చివరిక్షణం వరకు టీడీపీ, ప్రజలకి ఆయన చేసిన సేవలను మర్చిపోలేము. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడుగా పార్టీ, రాష్ట్రానికి వారు చేసిన సేవలను స్మరించుకుందాం’ అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రాభివృద్ధిలో పవన్ కల్యాణ్ సహకారం మరువలేనిది: సీఎం చంద్రబాబు
మాదక ద్రవ్య రహిత ఏపీ మా లక్ష్యం: అనిత
For More AP News And Telugu News