Share News

CM Chandrababu Birthday Wishes to Pawan Kalyan: రాష్ట్రాభివృద్ధిలో పవన్ కల్యాణ్‌ సహకారం మరువలేనిది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 02 , 2025 | 08:53 AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

CM Chandrababu Birthday Wishes to Pawan Kalyan: రాష్ట్రాభివృద్ధిలో పవన్ కల్యాణ్‌ సహకారం మరువలేనిది: సీఎం చంద్రబాబు
CM Chandrababu Birthday Wishes to Pawan Kalyan

అమరావతి, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా చేసుకుంటున్నారు. కేకు కటింగులు, అన్నదానాలు, రక్తదానాలు, తదితర స్వంచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం, మంత్రులు ట్వీట్ చేశారు.


రాష్ట్రాభివృద్ధిలో పవన్ కల్యాణ్‌ సహకారం మరువలేనిది: సీఎం చంద్రబాబు

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌‌‌ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. ‘మిత్రులు పవన్ కల్యాణ్‌‌‌‌ది అడుగడుగునా సామాన్యుడి పక్షం... అణువణువునా సామాజిక స్పృహ... మాటల్లో పదును... చేతల్లో చేవ... జన సైన్యానికి ధైర్యం... మాటకు కట్టుబడే తత్వం. రాజకీయాల్లో విలువలకు పట్టం.... స్పందించే హృదయం... అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్థిల్లాలి. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


రాజకీయాల్లో పీపుల్ స్టార్‌‌గా పవన్ కల్యాణ్‌ ఎదిగారు: నారా లోకేష్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌‌‌ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. ‘వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్‌, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.


పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేవదేవుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, ఆష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని మనసారా కోరుకుంటున్నానని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.


ప్రజలకు స్ఫూర్తి నిచ్చే నాయకుడు పవన్ కల్యాణ్: అచ్చెన్నాయుడు

ప్రజలకు స్ఫూర్తి నిచ్చే నాయకుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Kinjarapu Atchannaidu) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమా రంగంలో తన ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను అలరించిన పవన్ కల్యాణ్.. రాజకీయ రంగంలోనూ సాధారణ ప్రజల సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ధైర్యవంతుడైన నాయకుడిగా నిలిచారు. ప్రజల కోసం తపన పడే పవన్ కల్యాణ్, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ ముందుంటారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాను’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్‌ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు

250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..

For More AP News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 10:45 AM