AP CM Nara Chandrababu Naidu : చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:26 PM
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబుకి తెలుగు రాష్ట్రాలనుంచే కాక, దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబుకి దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజలు, నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆశయాలను తిరిగి ఙ్ఞప్తికి తెచ్చుకుని, రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసిన యుగం చంద్రబాబుతో ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పాలనను సాంకేతికతతో పునర్నిర్మించడం నుండి నదుల అనుసంధానం, పెట్టుబడులు, హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీ, అమరావతి వరకు ఆయన నాయకత్వం ఒక అపూర్వ ప్రయాణమని లోకేష్ అన్నారు. 'ఈ శుభదినాన హృదయపూర్వక శుభాకాంక్షలు సార్, ఇంట్లో 'నాన్న' పనిలో 'బాస్' అని పిలిచే అదృష్టం నాకు కలిగింది'. అంటూ లోకేష్ తన ఎక్స్ ఖాతాలో తండ్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.
1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. 30 ఏళ్లుగా సంపద సృష్టి, సంస్కరణలు, దార్శనికత, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం అనే పదాలకు నిర్వచనంగా నిలిచారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసారు. అంటూ తెలుగుదేశం పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంకా ఎందరో చంద్రబాబు నాయుడికి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా శుభాభినందనలు తెలుపుతున్నారు.
తెలుగు నేల గర్వించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అంటూ కీర్తించారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు. తెలుగు రాష్ట్రాల ప్రగతి కారకుడు, యువతకు భవిష్యత్తు చూపిన మార్గదర్శి అని ఆయన తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు.