Home » AP CM
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబుకి తెలుగు రాష్ట్రాలనుంచే కాక, దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సీఎంకు స్థానిక నాయకులు, ప్రజలు అఖండ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.
పోలవరం-బనకచర్లతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కోస్తా తీరంలో 975 కిలోమీటర్లపాటు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రకృతి విపత్తులు, సునామీ, తుఫానుల నుంచి భూమిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేతృత్వంలో మొక్కల పెంపకంతో సముద్ర తీరంలో పర్యావరణ సమతుల్యత సాధించడానికి ప్రణాళికలు రూపొందించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ తనకు సమానమేనని.. రెండూ అభివృద్ధి చెందాలన్నదే తన ఆశ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు కడితే తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ఆయన గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు సర్వం సిద్ధమైంది. కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం బుధవారం జరగనుంది.
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు పలు గుడ్ న్యూస్‌లు చెప్పారు. ఆగస్టు 15నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, కేంద్రం రైతులకు ఇచ్చే అమౌంట్‌కు సమానంగా జమ చేస్తామన్నారు.
హంద్రీ-నీవా ద్వారా జూలై 10న నీటి విడుదల చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 3,873 కోట్లతో పనులు పూర్తి చేసి రాయలసీమను పంటల తోటగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
జమ్ముకశ్మీర్లో పాక్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు అగ్నివీర్ మురళీ నాయక్ దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. కన్నతండ్రి ఆశయంగా దేశరక్షణను ఎంచుకున్న మురళికి రాష్ట్ర ప్రభుత్వం, నాయకులు నివాళులు అర్పించారు
అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గాన్ని ఉద్బోధించారు. రాజధానిపై ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టి, అభివృద్ధి దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు