AP CM Chandrababu: సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఆపిన రైతు.. కారణమేంటంటే..
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:46 PM
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సీఎంకు స్థానిక నాయకులు, ప్రజలు అఖండ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తాజాగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సీఎంకు స్థానిక నాయకులు, ప్రజలు అఖండ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. ఆ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌లో వెళ్తుండగా ఓ హఠాత్పరిణామం చోటు చేసుకుంది. (AP News).
గొల్లప్రోలుకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి సీఎం చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డుపడ్డాడు. తన భూమి ఆన్లైన్‌లో తక్కువగా చూపిస్తోందని, తనకు న్యాయం చేయాలని ఓ ఫ్లెక్సీ పట్టుకుని సీఎం కాన్వాయ్‌కు ఎదురుగా నిలబడ్డాడు. అతడిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌ను ఆపి ఆ రైతుతో మాట్లాడారు.
వివరాలు తెలుసుకుని సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆ రైతుకు చంద్రబాబు హామీనిచ్చారు. అక్కడే గంగాధర్‌తో పాటు పలువురి నుంచి సీఎం చంద్రబాబు వినతి పత్రాలను స్వీకరించారు.
ఇవీ చదవండి..
స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో విశాఖ వైద్యుడు
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..