ఉపమాక క్షేత్రానికి కల్యాణ శోభ
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:58 AM
ఉమ్మడి విశాఖ జిల్లాలో అతి ప్రాచీనమైన ఉపమాక వేంకటేశ్వరస్వామి క్షేత్రం కల్యాణశోభతో కాంతులీనుతోంది. ఆదివారం ఉదయం నుంచి శ్రీవారి వార్షిక తిరు కల్యాణోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

- నేటి నుంచి శ్రీవారి ఉత్సవాలు ప్రారంభం
నక్కపల్లి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లాలో అతి ప్రాచీనమైన ఉపమాక వేంకటేశ్వరస్వామి క్షేత్రం కల్యాణశోభతో కాంతులీనుతోంది. ఆదివారం ఉదయం నుంచి శ్రీవారి వార్షిక తిరు కల్యాణోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అంకురార్పణ, అశ్వ వాహన సేవతో స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు తెలిపారు. సోమవారం శ్రీవారి కల్యాణోత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వెంకన్న వార్షిక కల్యాణోత్సవాలు ఈ నెల 9 నుంచి 17 వరకు జరుగుతాయి. కల్యాణోత్సవాలు సందర్భంగా సోమవారం హోం మంత్రి వంగలపూడి అనిత స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలను విజయవంతం చేసేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం బయట క్యూ లైన్లు, విశాలమైన షెడ్లు ఏర్పాటు చేశారు.