Home » TDP - Janasena
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మొబైల్ కిడ్స్ ద్వారా బియ్యాన్ని త్వరితగతిన పరీక్షించవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అవినీతిలోకి నెట్టేసిందని ఆరోపించారు
SHO ఛాంబర్‌లోకి వచ్చి విచారణ అధికారి అయిన సీఐని బెదిరించేలా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారని ఎస్పీ విద్యాసాగర్ మండిపడ్డారు. దీన్ని జిల్లా పోలీస్ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కొన్ని జిల్లాల్లో GSDP పెరుగుతోంది, మరికొన్ని జిల్లాల్లో తగ్గుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ హెచ్చుతగ్గులను కూడా మనం సరిచేయాలని తెలిపారు.
ప్రజల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చు.. కానీ ప్రతిసారి మోసం చేయలేరని మాజీ సీఎం జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని పెమ్మసాని హితవు పలికారు. గుంటూరు, రాజధాని ప్రజలు బాగా తెలివిగల వారని తెలిపారు.
జిల్లాలో జరిగిన సూపర్ సిక్స్- సూపర్‌హిట్ సభకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో గురువారం ఆయన జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ సభకు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేయగా మూడు లక్షలమంది కంటే ఎక్కువగా తరలివచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.
జిల్లా నుంచి కరువును తరిమి కొడతానని, ఇది సీబీఎన మాట అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా ప్రజలకు అధికారికంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశానని తెలిపారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. రాయలసీమను ఎనర్జీ సిటీ చేస్తానని ప్రకటించారు. కియ పరిశ్రమతో అనంతకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చానని అన్నారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయని పనిని వంద రోజుల్లో పూర్తి చేశామని
ఏపీలో వైసీపీ ఉనికి కోల్పోతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. వైసీపీ నేతలకు అసెంబ్లీలో చర్చించే దమ్ముందా..? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి వారికి ఘన స్వాగతం పలికారు.
చారిత్రక ఘట్టానికి అనంతపురం సిద్ధమైంది. పది రోజుల వ్యవధిలో ఏకంగా 3.50 లక్షల మంది రాష్ట్ర ప్రజలను ఒక చోటకు చేర్చే మహాయజ్ఞం పూర్తి అయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, మూడు పార్టీల నాయకులు నగరంలో తిష్ట వేసి.. చక చకా ఏర్పాట్లు చేయించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికలలో చాటిన ఐక్యతను హామీల అమలులో కొసాగించారు. కేవలం 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను అమలు చేసి.. సగర్వంగా జనం ఎదుటకు వస్తున్నారు అగ్ర నాయకులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి ...
రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చేనేత బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోందని మంత్రి సవిత తెలిపారు. అదే సమయంలో ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచేలా చర్యలు చేపట్టిందని చెప్పుకొచ్చారు.