Minister Nadendla Manohar: రేషన్ బియ్యాన్ని స్పాట్‌లోనే పరీక్షించే మొబైల్ కిట్లు..
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:18 AM
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మొబైల్ కిడ్స్ ద్వారా బియ్యాన్ని త్వరితగతిన పరీక్షించవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అవినీతిలోకి నెట్టేసిందని ఆరోపించారు
విశాఖపట్నం: రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు పౌర సరఫరాల శాఖ సరికొత్త విధానం ప్రవేశ పెట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్పాట్‌లోనే బియ్యాన్ని పరీక్షించేందుకు అందుబాటులోకి మొబైల్ కిట్లు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. 700 మొబైల్ కిట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. మొబైల్ కిట్ పరీక్షలో బియ్యం ఎరుపు రంగులోకి మారితే అవి రేషన్ బియ్యంగా నిర్ధారించవచ్చని స్పష్టం చేశారు. గతంలో పట్టుకున్న బియ్యాన్ని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయించాల్సి వచ్చేదని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మొబైల్ కిట్స్ ద్వారా బియ్యాన్ని త్వరితగతిన పరిక్షించవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అవినీతిలోకి నెట్టేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పౌర సరఫరాల శాఖలో మార్పులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెక్ పోస్టులలో 33 మంది సిబ్బంది మూడు సిఫ్ట్‌లలో 24 గంటలు పనిచేస్తారని వివరించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అక్రమంగా తరలిస్తున్న 5.65 లక్షల క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి నాదెండ్ల చెప్పుకొచ్చారు. అక్రమార్కులపై 230 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు మంచి బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకొని రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం వినియోగంలో రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందని హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ దర్యాప్తు కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Central Govt: పాఠశాలల్లో యూపీఐతో ఫీజుల వసూలు
Dalit IPS Officer: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్