Central Govt: పాఠశాలల్లో యూపీఐతో ఫీజుల వసూలు
ABN , Publish Date - Oct 13 , 2025 | 07:00 AM
పాఠశాలల్లో విద్యార్థుల నుంచి తీసుకునే ఫీజుల వసూలుకు యూపీఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) చెల్లింపుల విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 12: పాఠశాలల్లో విద్యార్థుల నుంచి తీసుకునే ఫీజుల వసూలుకు యూపీఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) చెల్లింపుల విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు పాఠశాలల్లో యూపీఐ చెల్లింపుల విధానాన్ని అమలు చేయాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్ఈ, కేంద్రీయ విద్యాలయ సంఘఠన్(కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్) తదితర బోర్డులకు కేంద్ర విద్యా శాఖ లేఖలు పంపింది. ఇకపై, ఫీజులను యూపీఐ ద్వారా వసూలు చేసుకోవాలని ఆ లేఖల్లో స్పష్టం చేసింది. నగదు రహిత విధానం వల్ల పాఠశాలల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని కేంద్రం పేర్కొంది.