Dalit IPS Officer: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:57 AM
హరియాణా దళిత ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమనీత్ డిమాండ్‌తో ఎస్సీ, ఎస్టీ అత్యాచార....
చండీగఢ్, అక్టోబరు 12: హరియాణా దళిత ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమనీత్ డిమాండ్‌తో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3 (2) (వీ)ను చేర్చారు. ఈ సెక్షన్ కింద నిందితులకు పదేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ముందు ఈ చట్టంలోని 3(1) (ఆర్) కింద కేసు నమోదు చేశారు. అభియోగాలు రుజువైతే ఈ సెక్షన్ ఆరు నెలల నుంచి గరిష్ఠంగా ఐదేళ్లు మాత్రమే శిక్ష పడుతుంది. సీనియర్ ఐపీఎస్ అధికారుల కుల వివక్ష, అవమానాలు, వేధింపులు తట్టుకోలేక కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కుమార్ సూసైడ్ నోట్‌లో హరియాణా డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ బిజార్ణియా సహా 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు రాశారు. వారి వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నారు.