Home » Visaka
విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆవిర్భవించి 130 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈరోజు (సోమవారం) ‘స్టేషన్ మహోత్సవ్’ నిర్వహించారు.
విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులతోపాటు జీవీఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో కొండవాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
విశాఖలో ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28,445 పేద కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను పంపిణీ చేశారు.
‘స్వర్ణాంధ్ర 2047’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాల సాధనకు పటిష్ఠమైన బ్లూప్రింట్ రూపొందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 3న విజయవాడలో ‘పాన్-IIT AP సమ్మిట్ 2026’ నిర్వహించనుంది.
ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు కొత్త జంతువులు వచ్చాయి. జామ్‌నగర్‌లోని రాధేకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్‌తో జరిగిన జంతు మార్పిడి కార్యక్రమం విజయవంతమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’లో తెలిపారు.
విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లోని స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడుల చేశారు. విశాఖలోని మొత్తం121 సెంటర్లపై ఆదివారం రాత్రి ఈ దాడులు నిర్వహించారు.
విశాఖ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో తీవ్ర కలకలం రేపింది.
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఆదివారం ఉదయం ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం సందడిగా సాగింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాలకు చెందిన క్రీడా శాఖ మంత్రులు, అధికారులు సైక్లింగ్‌లో పాల్గొన్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ASR-1, ASR-2 పేర్లతో రెండు మార్గాల్లో ఈ సర్వీసులను నడపనున్నారు.
బిగ్‌బాస్ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఎంవీపీ కాలనీ పోలీసులను ఆశ్రయించింది.