BCY Ramachandra Yadav: విశాఖ హోటల్లో రామచంద్ర యాదవ్.. మోహరించిన పోలీసులు
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:08 AM
రామచంద్ర యాదవ్ పర్యటించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆయనను పోలీసులు అడ్డుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో రామచంద్ర యాదవ్ పర్యటించరాదు అంటూ ముందస్తుగా నోటీసులు ఇచ్చేందుకు మ్యారియేట్ హోటల్ వద్దకు పోలీసులు చేరుకున్నారు.
విశాఖపట్నం: బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు రామచంద్ర యాదవ్ ఉన్న మారియట్ హోటల్ వద్దకు చేరుకున్నారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వద్దకు వెళ్లకుండా విశాఖలోనే అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ బాధిత మత్స్యకారులకు మద్దతు తెలపడానికి రామచంద్ర యాదవ్ వెళ్లనున్నారు. అయితే.. రామచంద్ర యాదవ్ పర్యటించేందుకు అనకాపల్లి జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు.
అయినా.. రామచంద్ర యాదవ్ పర్యటించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆయనను పోలీసులు అడ్డుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అనకాపల్లి జిల్లాలో రామచంద్ర యాదవ్ పర్యటించరాదు అంటూ ముందస్తుగా నోటీసులు ఇచ్చేందుకు మ్యారియేట్ హోటల్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ వద్దు అంటూ కొద్ది రోజులుగా మత్స్యకారులు నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు వల్ల తమ ప్రాంతంలో సముద్రం కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంపై జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. కాగా, నిరసన తెలుపుతున్న మత్స్యకారులుకు మద్దతుగా రామచంద్ర యాదవ్ పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్‌ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు
Massive Explosion: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు