Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు
ABN , Publish Date - Oct 12 , 2025 | 07:09 AM
మదురై నుంచి శనివారం తెల్లవారుజామున చెన్నైకి బయల్దేరిన ఇండిగో విమానం ముందు వైపు అద్దం పగలడంతో కలకలం చోటుచేసుకుంది.
చెన్నై, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మదురై నుంచి శనివారం తెల్లవారుజామున చెన్నైకి బయల్దేరిన ఇండిగో విమానం ముందు వైపు అద్దం పగలడంతో కలకలం చోటుచేసుకుంది. చెన్నైకి 76 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం బయల్దేరగా, ల్యాండింగ్‌కు ముందు విమానం విండ్ షీల్డ్‌లో పగుళ్లు కనిపించాయి. పైలట్ గమనించి విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. దీంతో విమానాశ్రయంలో అన్ని ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కొద్దిసేపయ్యాక ఆ విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయింది.