Share News

Massive Explosion: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు

ABN , Publish Date - Oct 12 , 2025 | 05:56 AM

తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని పెత్తాలుపట్టిలో ఉన్న ఓ బాణసంచా కర్మాగారంలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది.....

Massive Explosion: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు

  • శివకాశిలో ఘటన.. నేలమట్టమైన ఓ గది

చెన్నై, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని పెత్తాలుపట్టిలో ఉన్న ఓ బాణసంచా కర్మాగారంలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కోసం రసాయన పదార్థాల టిన్నులను భద్రపరిచిన గదిలో నిప్పురవ్వలు పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. పేలుడుకు ఓ గది నేలమట్టమైంది. అదే సమయంలో చుట్టుపక్కల గదుల్లో ఉంచిన టపాసులకు కూడా మంటలు వ్యాపించాయి. నలువైపులా మంటలు వ్యాపించడంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళం మూడు ఫైరింజన్లతో తీవ్రంగా ప్రయత్నించింది. సాయంత్రం వరకూ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. జ్ఞానవేల్‌ అనే వ్యక్తి నడుపుతున్న ఆ కర్మాగారంలో దీపావళిని పురస్కరించుకుని టపాసులు తయారు చేస్తున్నారు. రోజూ 50 మందికి పైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు.

Updated Date - Oct 12 , 2025 | 06:28 AM