Montha Cyclone Effect: ముంచుకొస్తున్న మొంథా.. మూడు రోజులు సెలవులు
ABN , Publish Date - Oct 27 , 2025 | 09:27 AM
మెుంథా తుపాన్ దృష్ట్యా అనకాపల్లి జిల్లాలో కలెక్టర్ విజయ కృష్ణన్ మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు మొంథా తుపాన్ దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఇవాళ(సోమవారం), రేపు(మంగళవారం) రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనకాపల్లి జిల్లాలోనూ కలెక్టర్ విజయ కృష్ణన్ మూడు రోజులు సెలవులు ప్రకటించారు. మొంథా తుపాన్ ప్రభావం దృష్ట్యా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యాసంస్థలను ముసివేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా విద్యా సంస్థలను తెరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ విజయ కృష్ణన్ హెచ్చరించారు.
మరోవైపు.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. సోమశిల డ్యాంలో 70TMCలు, కండలేరు జలాశయంలో 60TMCలకు నీరు చేరుకుంది. వెయ్యి హెక్టార్లలో పంటలు నీటమునిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుపాన్ ప్రభావంతో చేపల వేట, చేనేత పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్తులు ఎదురైనా సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం
Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలే..!