Share News

సూపర్‌ సభకు స్వచ్ఛందంగా లక్షల జనం

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:22 AM

జిల్లాలో జరిగిన సూపర్‌ సిక్స్‌- సూపర్‌హిట్‌ సభకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో గురువారం ఆయన జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ సభకు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేయగా మూడు లక్షలమంది కంటే ఎక్కువగా తరలివచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.

సూపర్‌ సభకు స్వచ్ఛందంగా లక్షల జనం
మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

జగన అసమర్థత వల్లే ఆర్డీటీకి కష్టాలు

ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు

అనంతపురం క్రైం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరిగిన సూపర్‌ సిక్స్‌- సూపర్‌హిట్‌ సభకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో గురువారం ఆయన జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ సభకు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేయగా మూడు లక్షలమంది కంటే ఎక్కువగా తరలివచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. విజయోత్సవ సభ సక్సెస్‌ కావడం సంతోషంగా ఉందన్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం మభ్యపెట్టి జనాలను తరలించారంటూ ఫేక్‌ ప్రచారాలకు దిగడం శోచనీయమన్నారు. విప్‌ కాలవ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కూటమి ఆధ్వర్యంలో సూపర్‌సిక్స్‌-సూపర్‌హిట్‌ తొలిసభ అనంతపురంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతపురం అభివృద్ధి, సీమ భవిష్యత్తు టీడీపీతోనే ముడిపడి ఉందన్నారు. సూపర్‌ హిట్‌ సభ నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో జరిగిందన్నారు. రాయలసీమ గడ్డ టీడీపీ అడ్డాగా మారిందనడానికి మొన్న కడపలో జరిగిన మహానాడు, నిన్నటి అనంతలో జరిగిన సభ నిదర్శనం అన్నారు. ఈ ఆదరణను చూసే కుట్రతో జగన ఏది పడితే అది మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. జగన అసమర్థత, ఎంపీల స్వార్థం వల్లే 2021 నుంచి ఆర్డీటీకి కష్టాలు మొదలయ్యాయన్నారు. ఆర్డీటీ సేవలపై కేంద్రానికి వివరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ మంజూరు చేయించే బాధ్యతను ఇద్దరు ఎంపీలకు సీఎం అప్పగించినట్లు తెలిపారు. ఈ అంశంపై జగనకు, వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఎందుకు ప్రయత్నాలు చేయలేదంటూ ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణిశ్రీ, పల్లె సింధూరరెడ్డి, అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్‌, ప్రధానకార్యదర్శి శ్రీధర్‌చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంజినప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌, ఇతర టీడీపీ నాయకులు ఆలం నరసానాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:22 AM