SP Vidyasagar Naidu: సరైన పద్ధతి కాదు.. మాజీ మంత్రి పేర్ని నానిపై ఎస్పీ సీరియస్..
ABN , Publish Date - Oct 10 , 2025 | 07:37 PM
SHO ఛాంబర్‌లోకి వచ్చి విచారణ అధికారి అయిన సీఐని బెదిరించేలా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారని ఎస్పీ విద్యాసాగర్ మండిపడ్డారు. దీన్ని జిల్లా పోలీస్ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నానిపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు. సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కేసులో కొంత మందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని ఎస్పీ చెప్పుకొచ్చారు. అందులో భాగంగా A8గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని కూడా స్టేషన్‌కు పిలిపించి విచారించినట్లు పేర్కొన్నారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్ని నాని గ్రూపుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారని చెప్పారు.
SHO ఛాంబర్‌లోకి వచ్చి విచారణ అధికారి అయిన సీఐని బెదిరించేలా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారని ఎస్పీ విద్యాసాగర్ మండిపడ్డారు. దీన్ని జిల్లా పోలీస్ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఐ విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. 'పోలీస్ స్టేషన్‌కు రావడం తప్పులేదు, ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు.. అంతేగానీ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకుని వెళ్లిపోతా' అనడం సరికాదని పేర్కొన్నారు. పోలీసులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలని ఎస్పీ సూచించారు. గ్రూపులుగా వచ్చి గలాటా సృష్టించడం సరైన పద్ధతి కాదని, దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..