CM Chandrababu Naidu: మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలి..
ABN , Publish Date - Sep 13 , 2025 | 09:20 PM
కొన్ని జిల్లాల్లో GSDP పెరుగుతోంది, మరికొన్ని జిల్లాల్లో తగ్గుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ హెచ్చుతగ్గులను కూడా మనం సరిచేయాలని తెలిపారు.
అమరావతి: మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇవాళ(శనివారం) మంత్రులతో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని తెలిపారు. ఇక మనం వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే కొత్త టీమ్‌లను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడి ప్రభుత్వ పథకాలను వివరించినట్లు వెల్లడించారు.
కొన్ని జిల్లాల్లో GSDP పెరుగుతోంది, మరికొన్ని జిల్లాల్లో తగ్గుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ హెచ్చుతగ్గులను కూడా మనం సరిచేయాలని తెలిపారు. శాఖల కార్యదర్శులు, మంత్రులు కలిసి పనిచేయాలని సూచించారు. అమరావతిలో కట్టిన CRDA భవనంలోని పై అంతస్తులో.. మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అధికారులకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కలెక్టర్లు, ఇన్‌చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో 7 గ్రూపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు ఏం చేశాం, భవిష్యత్‌లో ఏం చేయబోతున్నామనేది.. కలెక్టర్ల భేటీలో అందరూ సంక్లిప్తంగా చెప్పాలన్నారు. సుదీర్ఘమైన ప్రెజెంటేషన్లు అవసరం లేదని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి
మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని