Share News

PM Narendra Modi: బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:02 AM

మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఐజ్వాల్‌ను భారత రైల్వే నెట్‌వర్క్‌తో మొదటిసారిగా కలుపుతూ చేపట్టిన బైరబీ-సైరాంగ్ కొత్త రైల్వే లైన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.

PM Narendra Modi: బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని
PM Narendra Modi Mizoram

ఐజ్వాల్, సెప్టెంబర్ 13: మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఐజ్వాల్‌ను భారత రైల్వే నెట్‌వర్క్‌తో మొదటిసారిగా కలుపుతూ చేపట్టిన బైరబీ-సైరాంగ్ కొత్త రైల్వే లైన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 8,070 కోట్ల వ్యయం అయ్యింది. సవాళ్లతో కూడి కొండ ప్రాంతాల మీదుగా ఈ రైల్వే లైన్‌ను నిర్మించారు. ఈ రైల్వే లైన్‌ కింద 45 టన్నెల్స్, 55 ప్రధాన వంతెనలు, 88 చిన్న వంతెనలను కూడా నిర్మించారు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని. ఈ సందర్భంగా ప్రధాని కీలక ప్రసంగం చేశారు.


దేశాభివృద్ధిలో మిజోరాం భాగస్వామ్యం కీలకలం అని ప్రధాని పేర్కొన్నారు. కొండ ప్రాంతాల్లో రైల్వేలైన్‌ కష్టతరమైనా నిర్మించామన్నారు. సవాళ్లతో కూడిన నిర్మాణాలు అద్భుతం అని పేర్కొన్నారు. ఈ రైల్వేలైన్‌ భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం అవుతుందని.. రైల్వేలైన్‌తో పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు ప్రధాని. ఏ రాష్ట్రాభివృద్ధికైనా రోడ్డు, రైల్వే, పోర్టు కనెక్టివిటీ ముఖ్యం అని పేర్కొన్నారు. మిజోరాం అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు. దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Updated Date - Sep 13 , 2025 | 11:28 AM