Pemmasani Chandrashekhar: ప్రతిసారి ప్రజలను మోసం చేయలేరు.. జగన్‌కు పెమ్మసాని హితవు..
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:27 PM
ప్రజల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చు.. కానీ ప్రతిసారి మోసం చేయలేరని మాజీ సీఎం జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని పెమ్మసాని హితవు పలికారు. గుంటూరు, రాజధాని ప్రజలు బాగా తెలివిగల వారని తెలిపారు.
గుంటూరు: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సవాల్ విసిరారు. జగన్‌కు చేతనైతే మెడికల్ కళాశాలల్లో టెండర్లు పాడుకుని.. అభివృద్ధి చేయాలని ఛాలెంజ్ విసిరారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలను స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్‌తో కలిసి కేంద్రమంత్రి పరిశీలించారు. కళాశాల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు..
ప్రజల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చేమో.. కానీ ప్రతిసారి చేయలేరనే విషయాన్ని మాజీ సీఎం జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని పెమ్మసాని హితవు పలికారు. గుంటూరు, రాజధాని ప్రజలు బాగా తెలివిగల వారని చెప్పుకొచ్చారు. ఎవరికి అధికారం ఇవ్వాలో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. గత వైసీపీ హయాంలో మంగళగిరి ఎయిమ్స్‌కు కనీసం నీళ్లు, రోడ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలోనే మెడికల్ కళాశాలకు అనుమతి తీసుకున్నామని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు జగన్ ఏదో తానే కష్టపడి తెచ్చినట్లు మాట్లాడటం చూస్తుంటే విడ్డూరంగా ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సెటైర్లు వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!