Home » Pemmasani Chandrasekhar
రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ మరోసారి సమావేశమైంది. రైతుల ప్లాట్లకు హద్దు రాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.
రాజధాని అమరావతి రైతుల సమస్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ భేటీ అయ్యింది. గ్రామాల వారీగా అభివృద్ధికి 20 రోజుల్లో 25 గ్రామాలకు డీపీఆర్ సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెల్లడించారు.
భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామానికి భారత్ నెట్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కావలిసిన ఎకో సిస్టమ్స్ అభివృద్ధి చేయడానికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఏపీలో డేటా సెంటర్ కోసం గత సంవత్సరకాలం నుంచి మంత్రి నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని పెమ్మసాని గుర్తు చేశారు. రూ.90,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్‌ను కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్ ఒక కుటుంబాన్ని ఏ విధంగా సురక్షితంగా ఇంటికి చేరుస్తారో.. అలాగే సీఎం చంద్రబాబు ఏపీని కూడా సురక్షితంగా ఉంచుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న సీఐఐ సదస్సుకు పారిశ్రామిక వేత్తలను వీరు ఆహ్వానం పలుకుతున్నారు.
గుంటూరు నగరం అభివృద్ధికి పంచ సూత్రాలు పెట్టుకొని పాలన అందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. జీజీహెచ్‌లో 8 లిఫ్ట్‌లు ఉంటే 5 పని చేసేవి కావని గుర్తు చేశారు.
ప్రజల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చు.. కానీ ప్రతిసారి మోసం చేయలేరని మాజీ సీఎం జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని పెమ్మసాని హితవు పలికారు. గుంటూరు, రాజధాని ప్రజలు బాగా తెలివిగల వారని తెలిపారు.
వైసీపీ హయాంలో ఎయిమ్స్‌కు నీళ్లు, రోడ్లు ఇవ్వలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ మహిళా కళాశాలను కూడా కాపాడలేని అసమర్థత జగన్ ప్రభుత్వానిదని పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు.
మయన్మార్ నుంచి 37 మంది భారతీయులను కేంద్ర విదేశాంగ శాఖ విడిపించిందని.. వారిలో ఏపీకి చెందిన నలుగురు తెలుగువారు కూడా ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ముగ్గురు, రాజమండ్రికి చెందిన ఒకరు ఉన్నారని చెప్పుకొచ్చారు.