Pemmasani: శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై పెమ్మసాని క్లారిటీ
ABN , Publish Date - Jan 02 , 2026 | 02:33 PM
శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్ఓబీ పనులపై ఎవరూ అపోహలకు గురి కావద్దని అన్నారు. సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లా, జనవరి2 (ఆంధ్రజ్యోతి): శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani Chandrasekhar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్ఓబీ పనులపై ఎవరూ అపోహలకు గురి కావద్దని అన్నారు. సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. ఇవాళ(శుక్రవారం) గుంటూరు జిల్లాలో పెమ్మసాని పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. శంకర్ విలాస్ ఆర్ఓబీని చెప్పిన సమయానికే పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. 2027 జూలైలోపే ఈ ఆర్ఓబీని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. జీజీహెచ్ వైపు 11 పిల్లర్లకుగాను 9 పూర్తి అవుతున్నాయని వెల్లడించారు. తాలూకా వైపు 5 ఫిల్లర్లు నిర్మించామని తెలిపారు పెమ్మసాని చంద్రశేఖర్.
ఒక సైడు పనులు పూర్తి చేసి రెండో వైపు నిర్మాణం చేస్తామని అన్నారు. ఈ పనుల దృష్ట్యా కార్మికుల సంఖ్యను పెంచి పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఆయా షాపుల యజమానులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. హైలెవెల్ క్రేన్లతో త్వరలో రైల్వేట్రాకుపై ఉన్న బ్రిడ్జిని తొలగిస్తామని అన్నారు. ల్యాండ్ ఎక్విజేషన్ కోసం కార్పొరేషన్ డబ్బు ఖర్చు చేస్తున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో వరుస ప్రమాదాలు.. నెత్తురోడిన రోడ్లు
రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్.. ఈసారైనా నోరు విప్పుతారా?
Read Latest AP News And Telugu News