Share News

Jogi Brothers: రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్.. ఈసారైనా నోరు విప్పుతారా?

ABN , Publish Date - Jan 02 , 2026 | 01:23 PM

జోగి బ్రదర్స్‌ను సిట్ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి సోదరులను సిట్ పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.

Jogi Brothers: రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్.. ఈసారైనా నోరు విప్పుతారా?
Jogi Brothers

విజయవాడ, జనవరి 2: నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ (Former Minister Jogi Ramesh), ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఈరోజు (శుక్రవారం) కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఇద్దిరిని సిట్ విచారించనుంది. గతంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్‌ను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో సారి వారిద్దరినీ కస్టడీలోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈ కేసులో జోగి బ్రదర్స్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.


జోగి ఫ్యామిలికి నోటీసులు

మరోవైపు జోగి కుటుంబానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి భార్య, కుమారులకు 41ఏ నోటీసులు జారీ అయ్యాయి. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో వైద్య పరీక్షలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జోగి ఫ్యామిలీకి పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు.


రిమాండ్ పొడిగింపు..

మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ పొగించింది కోర్టు. నేటితో రిమాండ్ ముగియడంతో నిందితులను విజయవాడ జిల్లా జైలు నుంచి కోర్టుకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో వారి రిమాండ్‌ను ఈనెల 16 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తిరిగి వారిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.


ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌, హరీష్ రావులపై కవిత షాకింగ్ కామెంట్స్

తెలంగాణలో వరుస ప్రమాదాలు.. నెత్తురోడిన రోడ్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 02:08 PM