Share News

Kavitha: కేసీఆర్‌, హరీష్ రావులపై కవిత షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:29 AM

కేసీఆర్, హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిందే అని అన్నారు. హరీష్ ఓ బచ్చా అంటూ కామెంట్స్ చేశారు.

Kavitha: కేసీఆర్‌, హరీష్ రావులపై కవిత షాకింగ్ కామెంట్స్
Kavitha

హైదరాబాద్, జనవరి 2: కల్వకుంట్ల కవిత (Kavitha) రాజకీయంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కవిత మాట్లాడుతూ.. ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్‌ఎస్ పని ఖతం అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ తప్పు చేయకపోతే సభకు రావాల్సిందే అని పట్టుబట్టారు. సభకు రాకుండా పిల్ల కాకుల మీద సభా సమయాన్ని వదలొద్దంటూ హితవు పలికారు.


రేవంత్‌ను పదిసార్లు ఉరితీయాలి..

అలాగే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టిన కేసీఆర్‌‌ను ఉరి తీయాంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. కేసీఆర్ మీద సీఎం భాష సరికాదన్నారు. కేసీఆర్‌ను ఒకసారి ఉరి తీయాలంటే, రేవంత్ రెడ్డిని పదిసార్లు ఉరి తీయాలంటూ మండిపడ్డారామె. సొంత జిల్లా మహబూబ్ నగర్‌కు రేవంత్ తెచ్చిన ప్రాజెక్టులు ఎన్నని ప్రశ్నించారు కవిత.


హరీష్‌ రావు బచ్చా..

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి కవిత మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఒక బచ్చా అని అన్నారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏం తెలుసంటూ హరీష్‌ను టార్గెట్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్‌ సభకు రాకపోతే హరీష్ రావే అన్నీ చూసుకోవడం సరికాదని.. కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని కవిత వ్యాఖ్యలు చేశారు.


రాజీనామాపై..

సెప్టెంబర్ 3న తాను రాజీనామా చేశానని.. నాలుగు నెలల కాలంలో అనేక సమీకరణాలు జరిగాయని ఈ సందర్భంగా తెలిపారు కవిత. తనకు మాట్లాడే అవకాశాలు ఇవ్వాలని సభకు వచ్చినట్లు చెప్పారు. ఒక ఫైల్.. భట్టి దగ్గరకు వస్తే నెలల తరబడి ఉంటుందని.. ఎందుకు ఇంత అలసత్వమని ప్రశ్నించారు. సభా అవకాశాల దృష్ట్యా తాను తన రాజీనామా అంశాన్ని మండలి ఛైర్మన్ దగ్గర ప్రస్తావిస్తానని అన్నారు. చాల గ్రామాల్లో అన్ని పార్టీలు కలిసి పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేశాయని.. అందుకే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదని తెలిపారు. అక్కడక్కడా మోదీ, కేసీఆర్‌ ఫోటోలు పెట్టినట్లు తెలిపారు. కొన్నిచోట్ల జాగృతి తరఫున కూడా గెలిచారని చెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏదో కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికల్లో సర్పంచ్‌ల ఓట్లు వేసేలా కుట్ర జరుగుతోందని.. త్వరలో దీన్ని బయటపెడతామని స్పష్టం చేశారామె.


నాకే సంబంధం లేదు..

సభలో హరీష్ వర్సెస్ రేవంత్ రెడ్డిల మధ్య వార్ ఉండనుందని కవిత చెప్పుకొచ్చారు. ఇది మరోసారి బీఆర్‌ఎస్‌కు బలమైన ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు. బబుల్ షూటర్ వచ్చి సభలో మాట్లాడితే పార్టీ బద్నామ్ అవుతుందంటూ ఎద్దేవా చేశారు. ఒక్కసారి కేసీఆర్ సభకు వచ్చి వివరణ ఇస్తే బాగుటుందని ఆమె అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌కు, తనకు సంబంధం లేదని.. ఇక ముందు ఉండబోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదో తనకు తెలీదని.. గత నాలుగు నెలలుగా కేసీఆర్‌తో మాట్లాడలేదని చెప్పారు. ఇక్కడ ఫిక్స్‌డ్‌ మ్యాచ్ నడుస్తోందని ఆరోపించారు. అది సభా వేదికగా బయటపడిందన్నారు. నీటి వాటాల అంశంలో కేసీఆర్ ఒక్కరే సమాధానం చెప్పగలరని.. హరీష్ రావుకు అవకాశం ఇవ్వడం అనేది సరైంది కాదని కవిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

లైసెన్స్ లేకుండా తుపాకీ.. వ్యక్తి అరెస్ట్

అన్వేష్ కేసు.. ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 12:42 PM