Share News

Online betting: యువకుడిని బలితీసుకున్న ఆన్‌లైన్ భూతం..

ABN , Publish Date - Jan 02 , 2026 | 10:34 AM

ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది ప్రస్తుత సమాజంలో ఒక సైలెంట్ వైరస్‌గా మారిపోయింది. యువత బెట్టింగ్ మోజులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కామారెడ్డిలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆన్‌లైన్ వ్యసనం కారణంగా ఓ యువకుడు బలయ్యాడు.

Online betting: యువకుడిని బలితీసుకున్న ఆన్‌లైన్ భూతం..
Kamareddy Online Betting

కామారెడ్డి, జనవరి 02: ఆన్‌లైన్ గేమ్‌ల(Online Betting Games) వ్యసనం కారణంగా మరో యువకుడు(Young Man) బలయ్యాడు. కామారెడ్డి జిల్లా (Kamareddy District)లోని ఓం శాంతి కాలనీకి చెందిన శ్రీకర్(30) అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్‌లో నష్టాలు రావడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. గత కొంత కాలంగా శ్రీకర్ ఆన్‌లైన్ బెట్టింగ్స్, రమ్మీ (Rummy) వంటి గేమ్స్‌కు బానిసయ్యాడు. తల్లిదండ్రులు, స్నేహితులు ఎంతగా వారించినా వారి మాటలు పట్టించుకోలేదు.


తొలుత చిన్న మొత్తాల్లో లాభాలు రావడంతో.. మరింత ఆశతో బంధువులు, స్నేహితుల వద్ద అప్పుచేసి మరీ ఆడటం మొదలుపెట్టాడు. గత రెండు సంవత్సరాలుగా సుమారు రూ.20లక్షల వరకు ఆన్‌లైన్ గేమ్‌లో నష్టపోయాడని బాధితుడు తల్లి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌(Police station)లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


శ్రీకర్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడు ఏయే యాప్‌లలో ఎంత డబ్బు పోగొట్టుకున్నాడు? ఎవరెవరు అతన్ని వేధించారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. రెండేళ్లుగా ఎన్నో చోట్ల అప్పులు తీసుకున్నాడని.. ఇటీవల అప్పిచ్చిన వాళ్లు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పపడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల డిజిటల్ యాక్టివిటీస్‌పై దృష్టి సారించాలని, బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ గేమింగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతులు మృతి

కుమారుడితో కలిసి నూతిలో దూకిన తల్లి.. ఇద్దరు మృతి

Updated Date - Jan 02 , 2026 | 10:56 AM