TGSRTC: ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతులు మృతి
ABN , Publish Date - Jan 02 , 2026 | 08:30 AM
సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు ఇటీవల దిల్‌సుఖ్‌నగర్ కొత్తపేటలో నివసిస్తున్న తమ కుమార్తె వద్దకు వచ్చారు.
హైదరాబాద్, జనవరి 02: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహేద్ నగర్‌లో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు ఇటీవల దిల్‌సుఖ్‌నగర్ కొత్తపేటలో నివసిస్తున్న తమ కుమార్తె వద్దకు వచ్చారు. గురువారం సాయంత్రం ట్యాంక్ బండ్ చూసేందుకు వారు బైక్‌పై బయలుదేరారు. మూసారాంబాగ్ హైటెక్స్ మోటర్స్ సమీపంలో.. వెనుక నుంచి వేగంగా వచ్చిన దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఆర్డినెరీ బస్సు.. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది.
దంపతులు రోడ్డుపై పడిపోయారు. వారిపై నుంచి బస్సు వెనుక టైర్ వెళ్లడంతో తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే కొత్తపేటలోని మృతుల కుమార్తెకు సైతం ఈ సమాచారం అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హిందూపురం, అనంతపురం వాసులకు గుడ్ న్యూస్..
గ్రేటర్‌లో.. మరో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు..
For More TG News And Telugu News