Electric buses: గ్రేటర్‌లో.. మరో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు..
ABN , Publish Date - Jan 02 , 2026 | 07:45 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో నూతనంగా మరో వెయ్యి ఈవీ బస్సులను నడిపేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఒక్క ఫిబ్రవరిలో 170 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి.. 2026 చివరి నాటికి మొత్తం వెయ్యి బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- గ్రేటర్‌లో రెండేళ్లలో 2 వేల ఈవీ బస్సులే లక్ష్యం
- 25 డిపోలలో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆర్టీసీ చర్యలు
హైదరాబాద్ సిటీ: 2026లో గ్రేటర్(Greater)లో భారీగా ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి తెచ్చేదిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త ఏడాదిలో ఫిబ్రవరి నాటికి 170 ఈవీ బస్సులతో పాటు దశలవారీగా ఏడాదిలో మొత్తం వెయ్యి ఈవీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గ్రేటర్ జోన్(Greater Zone)లో 25 బస్ డిపోలు ఉండగా ఇప్పటికే కంటోన్మెంట్,

మియాపూర్, రాణిగంజ్(Miyapur, Raniganj), హయత్‌నగర్, హెచ్‌సీయూ డిపోలలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్టీసీ 2026 ఏడాదిలో మరో 20 బస్ డిపోలలో పూర్తిస్థాయిలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు(EV charging stations) ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించింది. రాబోయే రెండేళ్లలో గ్రేటర్ పరిధిలో 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడంతోపాటు గ్రేటర్‌జోన్‌ను ఈవీ జోన్ మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం
Read Latest Telangana News and National News