Maharashtra: కుమారుడితో కలిసి నూతిలో దూకిన తల్లి.. ఇద్దరు మృతి
ABN , Publish Date - Jan 02 , 2026 | 07:38 AM
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల కుమారుడితో కలసి కన్నతల్లి నూతిలో దూకింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.
బీడ్, జనవరి 02: మహారాష్ట్ర బీడ్ తాలుకాలో లింబారుయ్ గ్రామ సమీపంలోని వస్తీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల కుమారుడు వేదాంత్‌తో కలిసి కన్నతల్లి ప్రజక్త రామేశ్వర్ దరాడే (23) నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం ఇంటి నుంచి కుమారుడితోపాటు ఆమె బయటకు బయటకు వెళ్లింది. ఇంటికి తిరిగి ఎంతసేపటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు వారి కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. వారి ఆచూకీ ఎక్కడ లభ్యం కాలేదు. ఇంటికి300 మీటర్ల దూరంలోని బావిలో చూడగా.. రామేశ్వర్ దరాడే విగత జీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు.
నూతిలో నీరు అధికంగా ఉండడంతో.. ఆమె కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఐదు విద్యుత్ మోటర్లు ఏర్పాటు చేసి.. నూతిలోని నీటిని బయటకు తీశారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని బావిలో పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహన్ని సైతం బయటకు తీశారు. ఆ తర్వాత ఈ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం బిడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడితో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం
For More National News And Telugu News