Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:24 AM
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. యూరియా కొరతపై చర్చ జరపాలంటూ బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనపై మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలా చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతీ అంశంపై జవాబు చెబుతామని తెలిపారు.
ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయని... ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉందన్నారు. సభకు సహకరించాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మంత్రి శ్రీధర్ కోరారు. సభ్యుల ఆందోళనల నడుమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అంతకుముందు అసెంబ్లీ మెంబర్స్ ఎంట్రీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేశారు. యూరియా కొరతపై చర్చించాలంటూ ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.
ఇక ఈరోజు సభలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై చర్చ జరుగనుంది. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. అలాగే జీహెచ్‌ఎంసీ బిల్లుతో పాటు పలు బిల్లులను సర్కార్ సభలో ప్రవేశపెట్టనుంది.
ఇవి కూడా చదవండి...
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. ఎందుకంటే?
లైసెన్స్ లేకుండా తుపాకీ.. వ్యక్తి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News