YouTuber Anvesh: అన్వేష్ కేసు.. ఆ వివరాలు ఇవ్వండి.. ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:05 AM
హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
హైదరాబాద్, జనవరి 2: యూట్యూబర్ అన్వేష్‌పై (YouTuber Anvesh) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు సమర్పించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు పోలీసులు లేఖ రాశారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి రిప్లై కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. కాగా.. ఇటీవల హిందూ దేవతలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. విదేశాల్లో ఉంటూ దేవీదేవతలపై అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అన్వేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాంటూ డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఈ వ్యాఖ్యలపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అన్వేష్‌పై సినీనటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 352, 79, 299, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్వేష్‌పై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. అన్వేష్‌ను వెంటనే భారత్‌కు రప్పించాలని... అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌ను నిరసిస్తూ అన్వేష్ ఓ వీడియో చేశారు. అంతా బానే ఉంది. కానీ ఆ వీడియోలోనే హిందువులు దేవతగా కొలిచే సీతమ్మ వారితో పాటు ద్రౌపదిపై అన్వేష్ జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ సంఘాలతో పాటు నెటిజన్లు కూడా ఆ వీడియోపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
లైసెన్స్ లేకుండా తుపాకీ.. వ్యక్తి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News