Home » KCR
గులాబీ బాస్‌కు ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. పార్టీలో అంతర్గత కలహాలు, ఇటు కుటుంబంలో వ్యతిరేక స్వరాలు వినిపించాయి. దీంతో ఏడాది కేసీఆర్‌కు గండాల ఏడాదిగా గడిచిందని చెప్పొచ్చు.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ అధికార నాయకత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గులాబీ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నాయకులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్, ఉప నేతలు, విప్‌లుగా ప్రకటించారు.
నందినగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించారు.
తెలంగాణ శాసనసభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లలో ఆరుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.....
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన వెంటనే కేవలం ఐదు నిమిషాల్లోనే తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చారు సీఎం.
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అందరికంటే ముందే తన చైర్లో కూర్చున్న మాజీ సీఎం.. కాసేపటికే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు ప్రారంభమయ్యాయి. సుమారు తొమ్మిది నెలల విరామం తర్వాత సభకు హాజరయ్యారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. అయితే.. అసెంబ్లీలో ఒక ఆసక్తికర పరిణాం చోటు చేసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సాగునీళ్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది...
సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష కేసీఆర్ హాజరవనున్నారా? సభలో కృష్ణా జలాలపై జరిగే చర్చలో ఆయన పాల్గొంటారా? అంటే అవుననే చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.