Share News

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నం.. బీఆర్‌ఎస్‌‌వీ నేతల అరెస్ట్

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:40 PM

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించిన బీఆర్‌ఎస్‌‌వీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నం.. బీఆర్‌ఎస్‌‌వీ నేతల అరెస్ట్
BRS leaders arrested

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1: హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (Former CM KCR) సిట్ విచారణ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) నాయకులు మినిస్టర్స్ క్వార్టర్స్‌ ముట్టడికి యత్నించారు. నల్ల జెండాలతో మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తుంగ బాలును అరెస్టు చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్‌వీ విద్యార్థి నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. దీంతో 'సీఎం డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేస్తూ బీఆర్‌ఎస్వీ నాయకులు ధర్నాకు దిగారు.


సీఎం నివాసం వద్ద బందోబస్తు..

కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంతో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, నిరసనలకు (KTR) పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం నివాస పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అనుమానితులను పరిసర ప్రాంతాల నుంచి పంపించేస్తున్నారు. జిల్లాల్లో ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అడ్డుకుని, పలువురిని అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్..

కలలో కూడా అనుకోలేదు.. కేసీఆర్ భావోద్వేగం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 05:11 PM