ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్..
ABN , Publish Date - Feb 01 , 2026 | 03:04 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో విచారణ జరుగుతోంది..
హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) విచారణ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. నందినగర్ నివాసంలోని రెండో ఫ్లోర్‌లో విచారణ జరుగుతోంది. అధికారులు ఈ విచారణను వీడియో రికార్డు చేస్తున్నారు. కేసీఆర్‌ను ఎస్‌బీ జాయింట్ సీపీ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, ఏసీపీ వెంకటగిరి, గ్రే హౌండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ శ్రీధర్ విచారిస్తున్నారు. కేసీఆర్ విచారణ సమయంలో ఆయన దగ్గర తన న్యాయవాది సంతోష్ రావును ఉంచాలని కేసీఆర్ న్యాయవాది రాంచందర్ రావు కోరారు.
ఈ సమయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ నివాసంలోనే ఉండనున్నారు. నివాస పరిసరాల్లో నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఐదుగురు డీసీపీలతో కూడిన బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు నందినగర్ నివాసం చుట్టూ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైపు నుంచి కేసీఆర్ నివాసం వైపు ఎవరినీ అనుమతించడం లేదు. ఈ విచారణ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి..
కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్
ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్‌కు కేసీఆర్.. పోలీసుల అలర్ట్
Read Latest Telangana News And Telugu News