Share News

మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ మిగలరు: మంత్రి లక్ష్మణ్

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:10 AM

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో చేరికలు ఉంటాయని కేసీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు.

మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ మిగలరు: మంత్రి లక్ష్మణ్
Adluri Lakshman Kumar

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో చేరికలు ఉంటాయని కేసీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు. ‘మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగలరు’ అని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డిని కాదని కేసీఆర్ దగ్గరికి వెళ్లే నేతలు ఎవరూ ఉండరని మంత్రి స్పష్టం చేశారు.


బీఆర్ఎస్.. పదేళ్లలో కాంగ్రెస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తాము రెండేళ్లలో బీఆర్ఎస్ నేతలపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదన్నారు. అక్రమంగా దోచుకున్న డబ్బులతో బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి తప్ప.. భయపడటం ఎందుకని ఆయన అన్నారు.


ఇవి కూడా చదవండి..

లండన్‌కు మంత్రి నారాయణ.. కీలక ప్రాజెక్టుల పరిశీలన

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 01:50 PM